ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా వేడుకలకు ముస్తాబు

ABN, First Publish Date - 2020-10-25T11:02:21+05:30

తెలం గాణలో అతిముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడు కలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెడుపై మంచి విజయమే విజయదశమి


నల్లగొండ కల్చరల్‌, అక్టోబరు 24: తెలం గాణలో అతిముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడు కలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నరకాసురుడిని దుర్గాదేవి సంహరిం చడంతో చెడుపై సాధించిన విజయాని కి ప్రతీకగా విజయదశమి పండుగ అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరాకు తొమ్మిది రోజుల ముందుగా అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు, పదోరోజు విజయ దశమి వేడుకలు నిర్వహిస్తారు.


అదేవిధంగా మహిళలు గౌరీమాతను బతుకమ్మగా కొలుస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. ఎంగి లిపువ్వు బతుకమ్మతో ఉత్సవాలు ప్రారంభమై చివరి రోజు శని వారం సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగిశాయి. విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలకు నల్లగొండ పట్టణంలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయం, వీటీకాలనీ వేంకటేశ్వరస్వామి, బీట్‌. మార్కెట్‌ శ్రీరామకోటిస్తూప దేవాలయం, తులసీనగర్‌ భక్తాంజనేయ స్వామి, షేర్‌బంగ్లా సంతోషిమాత, యాదగిరి గుట్ట, మట్టపల్లి నృసింహుడు, చెర్వుగట్టు, మేళ్లచెర్వు ఆలయాలు ముస్తాబయ్యాయి.


ఆలయాల్లో శమి పూజకు ఏర్పాట్లు చేశారు. అర్యసమాజ్‌ మందిరం ఆధ్వర్యంలో శోభాయాత్ర జరుగనుంది. కరోనా కారణంగా అంతా ఇళ్లలోనే పండుగ నిర్వహించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్తున్న వారితో బస్టాండ్లు, రహదారులపై రద్దీ ఏర్పడింది. కొవిడ్‌ కారణంగా ఇంతకాలం వ్యాపారాలు లేక వెలవెల బోయిన వీధులు పండుగతో  కొత్తకళను సంత రించుకున్నాయి.

Updated Date - 2020-10-25T11:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising