ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులకు డీసీసీబీ రుణాల పంపిణీ

ABN, First Publish Date - 2020-06-01T09:58:40+05:30

వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం అభినందనీయమని విద్యుత్‌ శాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రుణాలు పంపిణీ చేయడం అభినందనీయమని  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డీసీసీబీలో వ్యాపార రుణాల స్కీంను లాంఛనంగా ప్రారంభించి 16మంది లబ్ధిదారులకు రూ.కోటి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాపారులు, రైతులు రుణాలు పొంది ఆర్థికాభివృద్ధి  సాధించాలన్నారు.


డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎ్‌సల నుంచి మరో పదిరోజుల పాటు పంట రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీఎసీఎస్‌ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, మదన్‌మోహన్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T09:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising