ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష : శంకర్‌నాయక్‌

ABN, First Publish Date - 2020-06-01T09:59:30+05:30

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, 203 జీవోను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మే 31 : దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, 203 జీవోను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌,  కాం గ్రెస్‌ సీనియర్‌ నేతలు గుమ్మల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, వేణుధర్‌రెడ్డితో కలిసి శ్రీశైలం సొరంగమార్గం, ఎస్‌ఎల్‌బీసీ పనులు పరిశీలించారు.


ఈ సందర్భంగా శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ 203 జీవోను రద్దు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం సొరంగమార్గం టన్నెల్‌-1 వద్ద జూన్‌ 2న జలదీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీక్ష కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని శ్రేణులను కోరారు. ఆయన వెంట నేనావత్‌ కిషన్‌నాయక్‌, సిరాజ్‌ఖాన్‌, జాల నర్సింహరెడ్డి, మాధవరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T09:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising