ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్లరేపాకలో బాలుడి అదృశ్యం

ABN, First Publish Date - 2020-12-29T05:53:31+05:30

వలిగొండ మండలంలోని రెడ్లరేపాకలో బాలుడు సోమ వారం అదృశ్యమయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, డిసెంబరు 28: వలిగొండ మండలంలోని రెడ్లరేపాకలో బాలుడు సోమ వారం అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన దుబ్బ నర్సింహ కుమారుడు దుబ్బ  మనోజ్‌కుమార్‌(16) డిసెంబరు 26న ఉదయం 11.30గంటలకు  వ్యవసాయ పొలం పత్తిచేను వద్దకు తన తల్లిప్రేమలతను బైక్‌పై తీసుకొని అక్కడ దించాడు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి చేరుకొని ఇంట్లో బైక్‌ను ఉంచి ఎటో వెళ్లిపోయాడు. బంధువుల,  చుట్టుపక్కల వారిని, మిత్రుల ఇంటి వద్ద వెతికినా ఫలితం లేదు. బాలుడి తంల్లి ప్రేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. 


 గీత కార్మికుడికి  గాయాలు

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 28:  మండలంలోని సైదాపురంలో తాటిచెట్టుపైనుంచి పడి గీతకార్మికుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన శాగంటి వెంకటేశం సోమవారం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాద వశాత్తు  కిందపడ్డాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం  భువనగిరి ఏరియా ఆసుపత్రికి తలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ కు తరలించారు.


రిమాండ్‌కు తరలింపు 

వలిగొండ, డిసెంబరు 28: వలిగొండ పట్టణానికి చెందిన పానీపూరి బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్న రేగు ముత్యాలుపై ఈనె23న అకార ణంగా దాడికి పాల్పడిన స్థానిక వ్యక్తి ఎం.శివకుమార్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు. 


ట్రాఫిక్‌ పోలీసులతో గొడవ 

 ఇద్దరు యువకుల అరెస్ట్‌ 

బీబీనగర్‌, డిసెంబరు 28: విధి నిర్వాహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులతో గొడవకు దిగి విధులకు ఆటంకాలు కలిగించిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.   బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి డ్రంకెన్‌ డ్రైవ్‌ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సీఐ సతీ్‌షతో పాటు ఇతర సిబ్బంది హైదరాబాద్‌ మల్లాపూర్‌కు చెందిన ప్రకాశ్‌ వర్మ, శివకుమార్‌ అనే ఇద్దరు యువకులు గొడవకు దిగి విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై ట్రాఫిక్‌ ఏఎ్‌సఐ ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-12-29T05:53:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising