ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’ పోర్టల్‌తో భూవివాదాలకు చెక్‌ : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-03T10:30:27+05:30

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో భూవివాదాలకు చెక్‌ పడుతుందని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌, నవంబరు 2 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌తో భూవివాదాలకు చెక్‌ పడుతుందని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్‌ సోమవారం ప్రారంభం కావడంతో సూర్యాపేట తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలు తహసీల్దార్‌ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని, తప్పనిసరిగా లాగ్‌బుక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యల తీసుకోవాలన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొదటి రోజు ధరణి పోర్టల్‌ ద్వారా ఒక రిజిస్ట్రేషన్‌ జరిగిందని తహసీల్దార్‌ ఎం.వెంకన్న తెలిపారు. ఆయన వెంట డీటీ వంశీ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-11-03T10:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising