ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-12-18T05:00:44+05:30

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ దీపిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 17 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గురువారం జరిగిన 1వ, 7వ స్థాయి, 2, 4వస్థాయి సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం అందజేసే సబ్సిడీని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు లబ్ధిపొందేలా చైతన్యపర్చాలని ఆమె సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆమె అన్నారు. 

విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలి

జాజిరెడ్డిగూడెం మండలంలోని బొల్లంపల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారని జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌ అన్నారు. దీనికి తోడు 100 యూనిట్ల సబ్సిడీని మంజూరు చేయడంలేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా సకాలంలో జరగడంలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ జడ్పీటీసీ కృష్ణకుమార్‌ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో జడ్పీసీఈవో విజయలక్ష్మి, జడ్పీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-18T05:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising