ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రపాలనగరాన్ని అభివృద్ధి చేయాలి: జహంగీర్‌

ABN, First Publish Date - 2020-12-11T06:02:33+05:30

చారిత్రక కేంద్రమైన ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, డిసెంబరు10: చారిత్రక కేంద్రమైన ఇంద్రపాలనగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని ఇంద్రపాలనగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రామన్నపేట నుంచి భువనగిరి ప్రధాన రహదారి వెడల్పు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ నిత్యం బాటసారులు మృత్యువాత పడుతున్నారన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజల ప్రాణాలు రక్షించాలని కోరగా, పట్టించుకోకపోగా ఒక యువకుడు గుంతలో పడి మృత్యువాత పడ్డాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, మీర్‌ఖాజాఅలీ, రాధారపు మల్లేశం, బొనగిరి శ్రీనివాస్‌, సుర సత్తయ్య, జానాచారి, అశోక్‌, రాములు, సత్తయ్య, వి.సత్యం, బి.యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising