ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటిని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలే..

ABN, First Publish Date - 2020-03-25T14:44:11+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత మెడికల్‌ షాపు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఉమ్మడి నల్లగొండ జిల్లా డ్రగ్‌ ఏడీ ఎం.శ్రీనివాస్‌, యాదాద్రి భువనగిరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి : కరోనా వైరస్‌ నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత మెడికల్‌ షాపు యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఉమ్మడి నల్లగొండ జిల్లా డ్రగ్‌ ఏడీ ఎం.శ్రీనివాస్‌, యాదాద్రి భువనగిరి జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌కుమార్‌ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు మెడికల్‌ షాపులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర వైద్య సేవలకు మెడికల్‌ షాపులు తెరిచి ఉంటాయన్నారు. ప్రమాదకర వైర్‌సను అరికట్టడానికి సామాజిక బాధ్యతగా మెడికల్‌ షాపునకు వచ్చిన వారు ఐదు మీటర్ల దూరం పాటించాలని సూచించారు. ఎవరైనా మాస్కులను, శానిటైజర్లను అధిక ధరలకు విక్రయిస్తే డ్రగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


సూర్యాపేట సిటీ: కూరగాయల ధరలు పెంచి విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని  సూర్యాపేట మండల ఉద్యాన,పట్టు పరిశ్రమల అధికారి రంగు ముత్యం రాజు అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. ఆయనవెంట  వెలుగు వెంకన్న, కాల్‌రామ్‌, శ్రీను, కోటి, రామచంద్రు, నాగరాజు ఉన్నారు.


కలెక్టరేట్‌లో కరోనా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 

కరోనా వైరస్‌ నేపథ్యంలో కలెక్టరేట్‌లో 18004257106 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. కరోనా వైర్‌సకు  సంబంధించి ఫిర్యాదు చేయాలంటే ఈ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. 24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.


చౌటుప్పల్‌ టౌన్‌: చౌటుప్పల్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో ఆర్డీవో సూరజ్‌కుమార్‌  ఆదేశాల మేరకు దుకాణాల వద్ద ధరల బోర్డులను మునిసిపల్‌ అధికారులు మంగళవారం ఏర్పాటు చేయించారు. భువనగిరి రైతు బజారులోని ధరలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు స్థానిక  రైతుల అభిప్రాయాల మేరకు ధరలను నిర్ణయించి బోర్డులను ఏర్పాటు చేశారు.


ఉగాది సరుకులకు వినియోగదారుల పరుగులు

చౌటుప్పల్‌లోని దుకాణాల వద్ద మంగళవారం సాయంత్రం వినియోగదారులు బారులు తీరారు. ఉగాది పండుగను పురస్కరించుకొని  కిరాణ షాపులు, కూరగాయల దుకాణాల వద్ద వినియోగదారులు గుంపులు, గుంపులుగా కనిపించారు. మామిడి కాయలు, ఆకులు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు.

Updated Date - 2020-03-25T14:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising