ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందులు ఇప్పించండి మహాప్రభో.. ఓ కరోనా బాధితుడు ఆవేదన

ABN, First Publish Date - 2020-08-12T17:22:48+05:30

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.. అధికారులు హోం క్వారంటైన్‌లో ఉండమన్నారు.. మొదటిరోజు నాలుగు మందు బిళ్లలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడంలేదు’. అని హుజూర్‌నగర్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): ‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.. అధికారులు  హోం క్వారంటైన్‌లో ఉండమన్నారు.. మొదటిరోజు నాలుగు మందు బిళ్లలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడంలేదు’. అని హుజూర్‌నగర్‌కు చెందిన ఓ కరోనా పాజిటివ్‌ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలామంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఓ కరోనా బాధితుడు  మంగళవారం మీడియాకు ఫోన్‌ చేశాడు. వైద్యాధికారులు, ఆశావర్కర్లు, హెల్త్‌ అధికారులు సహకారం అందించడం లేదని, కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. 


తన కుటుంబంలో ఇద్దరమే ఉండగా పాజిటివ్‌ వచ్చింది. బయటకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పాడు. మందులు కావాలని ఫోన్‌ చేసినా వైద్యులు స్పందించడం లేదని విలపించాడు. దీనిపై మండల వైద్యాధికారి లక్ష్మణ్‌గౌడ్‌ స్పందిస్తూ రెండు మూడు రోజుల నుంచే పాజిటివ్‌ రోగులకు కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు కూడా ఇచ్చామని చెప్పారు. కావాలనే కొంతమంది విమర్శలు చేస్తున్నారని, ఏరియాఆస్పత్రిలో పాజిటివ్‌ టెస్ట్‌లుచేసి కిట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-12T17:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising