కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు
ABN, First Publish Date - 2020-12-29T05:59:47+05:30
దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీతోనే దేశ సమైక్యత, సర్వతోముఖాభివృద్ధి స ఆధ్యమవుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు.
యాదాద్రి, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీతోనే దేశ సమైక్యత, సర్వతోముఖాభివృద్ధి స ఆధ్యమవుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా భువనగిరిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ అన్నారు. మునిసిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్, పోతంశెట్టి వెంకటేశ్వరు పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజాపేట, మోత్కూరు, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించారు.
Updated Date - 2020-12-29T05:59:47+05:30 IST