ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసం అమ్మకం

ABN, First Publish Date - 2020-12-04T04:57:33+05:30

లొట్టలేసుకుని తినే కోడి మాంసంలో కల్తీ జరుగుతోంది.

చచ్చిన కోళ్ల మాంసాన్ని చూపిస్తున్న మునిసిపల్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనిఖీలో అధికారుల గుర్తింపు

కోదాడలో చికెన్‌ దుకాణం సీజ్‌

కోదాడటౌన్‌, డిసెంబరు 3: లొట్టలేసుకుని తినే కోడి మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఓ చికెన్‌ దుకాణాన్ని కోదాడ మునిసిపల్‌ అధికారులు గుర్తించి దానిని సీజ్‌ చేశారు. కోదాడ మునిసిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణం ఖమ్మం క్రాస్‌రోడ్డులోని క్వాలిటీ చికెన్‌సెంటరును మునిసిపల్‌ సిబ్బంది గురువారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చచ్చిన కోళ్లను, కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. శుభకార్యాలకు 50 కేజీల చికెన్‌ ఆర్డరు ఇస్తే చనిపోయిన కోళ్ల మాంసం 15 కేజీలు కలుపుతున్నారని తెలిపారు. చికెన్‌ దుకాణాన్ని సీజ్‌ చేశామని తెలిపారు. మాంసం విక్రయాల్లో  ప్రమాణాలు పాటించకుంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-04T04:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising