ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్వుగట్టులో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-12-15T06:28:01+05:30

కార్తీక మాసం చివరి సోమవారంతోపాటు అమావాస్య తిఽథి కావడంతో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధానాలయంతో పాటు ఉపాలయాల వద్ద భక్తులు క్యూకట్టారు.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా పూజా కార్యక్రమాలు

నార్కట్‌పల్లి, డిసెంబరు 14: కార్తీక మాసం చివరి సోమవారంతోపాటు అమావాస్య తిఽథి కావడంతో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం  చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో  భక్తుల రద్దీ నెలకొంది. ప్రధానాలయంతో పాటు ఉపాలయాల వద్ద భక్తులు క్యూకట్టారు. ఉపాలయాల ప్రాంగణాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. పలువురు దంపతులు సత్యదేవుడి వ్రతాలు, మహామండపంలో సామూహిక శివాభిషేకం నిర్వహించారు. స్వామివారికి రాత్రి లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరవడంతో మహామండపంలోనే లక్ష పుష్పార్చన చేశారు. భక్తులు కొందరు బోనాలు తీసుకురాగా, మరికొందరు రేణుకా ఎల్లమ్మకు ఊయల ముడుపులు కట్టారు. క్యూలైన్‌లో నిలబడి ఓపిక నశించిన భక్తులు తాత్కాలిక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మూడుగుండ్లపైకి వెళ్లిన భక్తులు క్షీరాభిషేకం చేసి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టడంతో క్యూలో నిల్చున్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో వచ్చిన పోలీసులు రద్దీని నియంత్రించారు. , దేవస్థానం వద్ద కుళాయి నుంచి సరిగా నీరు రాకపోవడంతో దాహం తీర్చుకునేందుకు భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పలువురు భక్తుల మొబైల్‌ ఫోన్లు చోరీకి గురయ్యాయి.



Updated Date - 2020-12-15T06:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising