ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులకు అండగా బీఎల్‌ఆర్‌ సంస్థ

ABN, First Publish Date - 2020-08-03T11:01:48+05:30

కొవిడ్‌ బాధితులకు బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ సంస్థ అండగా నిలవడం అభినందనీయమని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ టౌన్‌, ఆగస్టు 2 : కొవిడ్‌ బాధితులకు బీఎల్‌ఆర్‌ బ్రదర్స్‌ సంస్థ అండగా నిలవడం అభినందనీయమని డీసీసీ అధ్యక్షుడు కేతావత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా బీఎల్‌ఆర్‌ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు కరోనా వైరస్‌ బారిన పడిన వారికి డ్రైఫ్రూట్స్‌తో పాటు పలు రకాల పండ్లు, శానిటైజర్‌, విటిమిన్‌ ట్యాబ్లెట్లతో కలిపి 11రకాల వస్తువులను అందిస్తున్నట్లు తెలిపారు.


అదేవిధంగా కరోనా బారిన పడి మరణించిన రూరల్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి లక్ష రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు, కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు రూ.5ల క్షల ఆర్థిక సాయాన్ని స్వాతంత్య్ర దినోత్యవం రోజు అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T11:01:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising