ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

ABN, First Publish Date - 2020-12-20T04:55:39+05:30

రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు.

పీవీ శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు 

వివిధ పార్టీల నుంచి పలువురి చేరిక 

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 19: రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలోని కాంగ్రెస్‌ నాయకులు, యువకులు సుమారు 60మంది శ్యాంసుందర్‌రావు సమక్షంలో శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పల్లెకాడి బస్వయ్య, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సందెన బాల్‌నర్సింహ ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, ఒకే కుటుంబ పాలనకు విసిగి వేసారిన ప్రజలు, వివిధ పార్టీల నాయకులు నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వ హిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి వేముల నరేందర్‌రావు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, కర్నాటి ధనుంజయ, జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ, అధికార ప్రతినిధి కొంతం శంకర్‌గౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మేకల చొక్కారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంజి బస్వలింగం, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-20T04:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising