ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ABN, First Publish Date - 2020-12-11T05:48:36+05:30

అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడుపదార్థాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


యాదాద్రి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి శివారులో హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై ముం దస్తు సమాచారంతో హైదరాబాద్‌ నగరం నుంచి జనగామ జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 1792 జిలిటెన్‌ స్టిక్స్‌, 1600 డిటోనేటర్స్‌ను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌కు చెందిన కాంట్రాక్టర్‌ కందాడి వెంకటరెడ్డి, జనగామ జిల్లా దేవరుప్పుల మం డలం పెద్దమడూరుకు చెందిన వాంగ్‌డోతు భాస్కర్‌ను అరెస్టు చేశారు.  డిట నేటర్లు, జిలిటన్‌ స్టిక్స్‌ రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న యానాల పాండురంగారెడ్డి, యానాల భూపాల్‌రెడ్డి, శ్రీను, వెంకట్‌ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. 


Updated Date - 2020-12-11T05:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising