ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల భూములు లాక్కోవద్దు

ABN, First Publish Date - 2020-12-03T05:51:00+05:30

పల్లెప్రగతి, నర్సరీల పేరుతో దళితుల భూములు లాక్కోవడం అన్యాయమని ప్రజాప్రతినిధులు అన్నారు.

సూర్యాపేట: మండల పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌/ నూతన్‌కల్‌/ మద్దిరాల, డిసెంబరు 2: పల్లెప్రగతి, నర్సరీల పేరుతో దళితుల భూములు లాక్కోవడం అన్యాయమని ప్రజాప్రతినిధులు అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేఽశం జరిగింది. ఇమాంపేట ఎంపీటీసీ మామిడి కిరణ్‌ మాట్లాడుతూ దళితుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. చిన్న గ్రామపంచాయతీలకు ఇచ్చే అరకొర నిధులతో ఇబ్బందులు పడుతున్నామని లక్ష్మీతండా సర్పంచ్‌ సూర్యానాయక్‌ అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం బస్తాల కొరత తీవ్రంగా ఉందని ఎంపీటీసీ బాలాజీ సమావేశం దృష్టి తెచ్చారు. ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం మాట్లాడితే పట్టా భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేపడితే ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి పనులు నిలిపివేయిస్తామని అన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌నాయుడు, ఎంపీవో పరంకుశంరావు పాల్గొన్నారు. నూతన్‌కల్‌ లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకటి వెంకన్న, తాహసీల్దార్‌ జమీరుద్దీన్‌, ఎంపీడీవో ఇందిర, వైస్‌ ఎంపీపీ జక్కి పరమేష్‌, సర్పంచ్‌ చూడి లింగారెడ్డి ఉన్నారు. మద్దిరాలలో జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధులు, అధికారులు లేక వెలవెలబోయింది. సమావేశం ప్రారంభమైన చాలాసేపటికి అధికారులు, ప్రజాప్రతినిఽ దులు వచ్చారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎ రజాక్‌, ఎంపీడీవో సరోజ, రాజేష్‌, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising