ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతులెత్తి మొక్కుతున్న..శ్వాస ఆడటం లేదు

ABN, First Publish Date - 2020-08-01T11:24:39+05:30

నల్లగొండ జనరల్‌ ఆస్పత్రి సిబ్బంది వ్యవహార శైలిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారి తీరు మాత్రం మారడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నల్లగొండ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి వేడుకోలు

 ఓపీ సమయం ముగిసిందని పట్టించుకోని సిబ్బంది


నల్లగొండ అర్బన్‌, జూలై 31: నల్లగొండ జనరల్‌ ఆస్పత్రి సిబ్బంది  వ్యవహార శైలిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారి తీరు మాత్రం మారడం లేదు. నిడమనూరు మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ వారం రోజులు గా జర్వంతో ఇబ్బందిపడుతూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటోంది. అయినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం తో గ్రామ సర్పంచ్‌ 108కు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన 108 వాహనంలో ఆమెను నల్లగొండ ఆస్పత్రికి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీసుకొచ్చారు. అయితే కరోనా ఓపీ సమయం ముగిసిందని, ఆసుపత్రి సిబ్బంది తలుపులు వేశారు. ఊపిరి ఆడటం లేదని ఆ వృద్ధురాలు చేతులెత్తి మొక్కినా ఫలితం లేకపోవడంతో ప్రాణాలు ఆరచేతపట్టుకుని ఆస్పత్రి ఆవరణలోనే రాత్రి వరకు అక్కడే ఉంది.


Updated Date - 2020-08-01T11:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising