ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పరీక్షల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-08-22T10:25:07+05:30

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే బాధితులకు కరోనా పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్య ఆరోగ్యశాఖ కొవిడ్‌ నియంత్రణ ఇన్‌చార్జి నేహ


చింతపల్లి, తిరుమలగిరి, తుంగతుర్తి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే బాధితులకు కరోనా పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయ కొవిడ్‌ నియంత్రణ ఇన్‌చార్జి డాక్టర్‌ నేహ హెచ్చరించారు. శుక్రవారం చింతపల్లి ప్రాథమి క ఆరోగ్యకేంద్రాన్ని రాష్ట్ర బృందం తనిఖీ చేసింది. పీపీఈ కిట్లు, నిర్ధారణ పరీక్షలు తదితర వివరాలను పీహెచ్‌సీ వైద్యుడు అలీంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జ్వరం, దగ్గు, జలుబుతో వచ్చే బాధితులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఆమె వెంట డాక్టర్‌ మానస, ప్రజ్ఞ తదితరులు ఉన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, తుంగతుర్తి  పీహెచ్‌సీలను రాష్ట్ర బృందం తనిఖీ చేసింది. బృందంలో వైద్యులు శ్రీనివాస్‌, మహేష్‌, వైద్యాధికారులు ప్రశాంత్‌బాబు, నాగునాయక్‌ ఉన్నారు.

Updated Date - 2020-08-22T10:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising