యాదాద్రిలో నేటి నుంచి ఆర్జిత సేవలు
ABN, First Publish Date - 2020-10-04T10:16:14+05:30
యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు స్వామి దర్శనం అనంతరం మొక్కు పూజలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా ఈ
అనుమతి ఇచ్చిన దేవాదాయ శాఖ
యాదాద్రి టౌన్, అక్టోబరు 3: యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు స్వామి దర్శనం అనంతరం మొక్కు పూజలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా ఈ ఏడాది మార్చి 22 నుంచి కొవిడ్- 19 నిబంధనల కారణంగా ఆర్జిత సేవలను దేవాదాయ శాఖ నిలిపివేసింది. జూన్ 8న కొవిడ్ నిబంధనలను సడలించడంతో బాలాలయంలో దర్శనాలు ప్రారంభమయ్యా యి. అయితే ఆర్జిత సేవలైన సువర్ణ పుష్పార్చన, జోడు సేవలు, నిజాభిషే కం, నిత్యార్చన, సుదర్శన నారసింహహోమం, నిత్యతిరుకల్యాణ బ్రహ్మోత్సవం, వత్ర పూజలు ప్రారంభం కాలేదు. కేవలం నిత్యకల్యాణం, హోమం, అభిషేకం, అర్చనలు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే వెసులుబాటు కల్పించారు. కాగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో యా దాద్రి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఆదివారం నుం చి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు దేవాదా య శాఖ అనుమతి ఇచ్చింది. ఆదివారం ఉదయం 4గంటలకు ఆలయాన్ని తెరి చి సుప్రభాతంతో నిత్యపూజా కైంకర్యాలు నిర్వహించి రాత్రి 9.45 గంటలకు రాత్రి నివేదన శయనోత్సవ వేడుకలతో ద్వారబంధనం చేయనున్నట్టు ఈవో గీతారెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి.
పరిమిత సంఖ్యలో ...
స్వామి వారి నిజాభిషేక పూజల్లో రోజుకు 50 మంది భక్తులు, సహస్రనామార్చన పూజల్లో 25 మంది, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వెండి మొక్కు జోడు సేవల్లో 25 మంది దంపతులు, స్వామివారి లక్షపుష్పార్చన పూజల్లో ఇద్దరు దంపతుల చొప్పున, వ్రత పూజలు బ్యాచ్‌కి 50 మంది దంపతుల చొప్పున నాలుగు బ్యాచ్‌లను అనుమతించనున్నారు. ఇక భక్తులు మొక్కుతలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను కొవిడ్-19 నిబంధనల మేరకు ఉదయం 5గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొండపైన అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు కొండకింద తులసివనం వద్ద అద్దె గదులను బస కోసం కేటాయించనున్నారు. వారు గది ఖాళీ చేశాక శానిటైజ్ చేసి మరొకరికి కేటాయిస్తారు. అనుబంధ ఆలయంలో నిజాభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో 10 మంది దంపతులకు, సువర్ణ పుష్పార్చన కైంకర్యాల్లో ఒక బ్యాచ్‌లో రెండు టికెట్లు ఇవ్వనున్నారు.
నృసింహుడికి నిత్యకైంకర్యాలు
లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజా కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయంలో కవచమూర్తులను హారతితో కొలిచారు. నిజాభిషేకం అర్చన ల అనంతరం హోమం, నిత్యతిరుకల్యాణ వేడుకలు సంప్రదాయ రీతిలో కొనసాగాయి. కాగా, భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.5,80,405 ఆదాయం సమకూరింది. అదేవిధంగా హైదరాబాద్ నిజాంపేటకు చెందిన పి.అచ్యుతస్వాతి, సురే్‌షకుమార్ దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
Updated Date - 2020-10-04T10:16:14+05:30 IST