ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ABN, First Publish Date - 2020-08-22T10:26:40+05:30

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, మిషన్‌భగీరథ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 21 : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాలు, మిషన్‌భగీరథ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పనుల్లో అలసత్వం వహించవద్దని, ఈ నెల 31 వరకు 90 శాతం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. శ్మశాన వాటికలు, రైతువేదికలు, రోడ్లు, భవనాల శాఖల ద్వారా ప్రణాళిక, ప్రణాళికేతర చేపట్టిన పనులను, ఇంటి నల్లాల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈఈ ప్రకాష్‌, పాపారావు, వెంకటేశ్వర్లు, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 


మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి 

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలతోనే పూజలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను శుక్రవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి జిల్లాకు వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజేందర్‌, రవీందర్‌, వీరస్వామి, కమిషనర్‌ రామాంజులరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-22T10:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising