ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారుల ఆనందబాష్పాలతో నా కడుపు నిండింది

ABN, First Publish Date - 2020-12-11T08:42:26+05:30

డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు కార్చిన ఆనందబాష్పాలతో తన కడుపు నిండిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసీఆర్‌ ప్రశంసించడం ఆనందంగా ఉంది: హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, డిసెంబరు 10: డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు కార్చిన ఆనందబాష్పాలతో తన కడుపు నిండిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. సిద్దిపేటలో చేసిన అభివృద్ధిపై తనను కేసీఆర్‌ ప్రశసించడం ఆనందంగా ఉందన్నారు. ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించిన కేసీఆర్‌ తొలిసారిగా సిద్దిపేటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.


సిద్దిపేటలో రూ.వెయ్యి కోట్లతో ఐటీ టవర్‌, నెక్లెస్‌ రోడ్డు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు అతిథి గృహం, మెడికల్‌ కళాశాల తదితర అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయడం గోల్డెన్‌ డే అని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన కేసీఆర్‌ చేతుల మీదుగానే దాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఆశీస్సులతో పట్టణంలో 2,460 డబుల్‌ ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు.


డబుల్‌ ఇళ్ల పథకానికి సీఎం కేసీఆర్‌ స్వయంగా రూపకల్పన చేశారని తెలిపారు. గత ప్రభుత్వాలకు పేదలంటే చిన్న చూపు ఉండేదని, వారి హయాంలో మురికి కూపాలుగా ఉండే చోట ఇళ్లను కట్టించేవారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో డబుల్‌ ఇళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్‌తో గ్యాస్‌ కనెక్షన్‌, విద్యుత్‌, సిమెంట్‌ రోడ్లు తదితర సదుపాయాలతో గెటేడ్‌ కమ్యూనిటీ కంటే అందంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. ఇళ్లు రాని వారు చాలా మంది ఉన్నారని, అందుకు మరో వెయ్యి ఇళ్లు కావాలని సీఎంను విజ్ఞప్తి చేయడంతో సభలోని ప్రజలు చప్పట్లు కొట్టారు.

డబుల్‌ ఇళ్ల కాలనీకి కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సిద్దిపేట పర్యటన కోసం చాలా సమయాన్ని కేటాయించిన కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించడంతో హరీశ్‌రావు ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2020-12-11T08:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising