ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్లపల్లి జైలులో హరితహారం

ABN, First Publish Date - 2020-07-04T22:45:58+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో శనివారం చల్లపల్లి సెంట్రల్‌ జైలులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఖైదీలతో కలిసి మొక్కనాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో శనివారం చల్లపల్లి సెంట్రల్‌ జైలులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఖైదీలతో కలిసి మొక్కనాటారు. ఈసందర్భంగా సంతోష్‌కుమార్‌ ఖైదీలతో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఖైదీలు కూడా వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి వారి సమస్యలపరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో హరిత హారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, డీజీ రాజీవ్‌ త్రివేది, ఎంబిసి ఛైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, జైళ్లశాఖ ఐజీ సైదయ్య, డిఐజీ ఎంఆర్‌భాస్కర్‌, పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ దశరధరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T22:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising