ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

ABN, First Publish Date - 2020-07-09T02:13:09+05:30

సీఎం కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన పెద్దపల్లి జవాన్‌ శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన పెద్దపల్లి జవాన్‌ శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల సాయం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని లేఖలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. 


జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాను సాలిగం శ్రీనివాస్ అమరుడైన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్‌ 2012లో ఆర్మీలో చేరారు. బెంగళూరులో శిక్షణ పూర్తిచేసుకుని, చండీగఢ్‌, రాజస్థాన్‌లో పనిచేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా 226 ఆర్మీ ఫీల్డ్‌ యూనిట్‌కు బదిలీ అయ్యారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌లో సెలవులపై ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌.. గత నెల 7న తిరిగి విధులకు వెళ్లారు. సోమవారం విధి నిర్వహణలో ఉండగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆయన అమరుడయ్యారని ఉన్నతాధికారులు తెలిపారు. 

Updated Date - 2020-07-09T02:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising