ఉజ్మా ఫాతిమా కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అసదుద్దీన్
ABN, First Publish Date - 2020-08-22T23:51:26+05:30
ఉజ్మా ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తి దాయకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అజంపూరా ...
హైదరాబాద్: ఉజ్మా ఫాతిమా ధైర్యం అందరికీ స్ఫూర్తి దాయకమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అజంపూరా హరిలాల్ బాగ్ లో ఫాతిమా కుటుంబాన్ని అసదుద్దీన్ కలిసి పరామర్శించారు. ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నా.. ప్రమాదం నుంచి ఇతరులను కాపాడే క్రమంలో ఉజ్మా అసువులు బాసిందని అన్నారు. ఆమె కుటుంబానికి త్వరగా సాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ కోరారు.
Updated Date - 2020-08-22T23:51:26+05:30 IST