ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రీ కొడుకుల అహంకారాన్ని ప్రజలే దించారు: ఎంపీ అరవింద్

ABN, First Publish Date - 2020-12-04T17:54:40+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయామని, మార్పు రావాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయామని, మార్పు రావాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా అవినీతి పెరిగిపోయిందని, అహంకారపూరిత ప్రభుత్వం నడుస్తోందని, తండ్రీ కొడుకుల అహంకారాన్ని దించాలని ప్రజలు నిర్ణయించారని అన్నారు. ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇంత వరకు సెక్రటేరియట్‌కు పోలేదని విమర్శించారు. సచివాలయానికి వెళ్లని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హులా? అని ప్రశ్నించారు.


రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని అరవింద్ విమర్శించారు. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. 2023 అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, అలాగే 2024లో 15 ఎంపీ స్థానాలు గెలిచి నరేంద్రమోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-04T17:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising