ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్‌లకు ఎమ్మెల్యేలు, నేతల విరాళాలు

ABN, First Publish Date - 2020-08-13T08:04:42+05:30

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంటూ జిల్లాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనువై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేటీఆర్‌కు చెక్కులు అందజేత 
  • సీఎంఆర్‌ఎ్‌ఫకు ‘స్త్రీనిధి’ విరాళం రూ.4 లక్షలు

హైదరాబాద్‌, ఆగ స్టు 12 (ఆంధ్రజ్యోతి): గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంటూ జిల్లాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనువైన అంబులెన్సులు అందించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు. అంబులెన్స్‌ల కోసం ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ల ఆధ్వర్యంలో కేటీఆర్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో వారు ఈ మేరకు చెక్కులను అందజేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర  వెంకట రమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి ఒక అంబులెన్స్‌ వాహనానికి చెక్కును ఇచ్చారు. అలాగే, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర, కాకులమాను లక్ష్మణ్‌రావులు ఒక్కో అంబులెన్స్‌కు చెక్కులను అందజేశారు. కాగా, కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)కి స్ర్తీ నిధి ఉద్యోగులు 425 మంది తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు. రూ.4,00,491 విలువ గల చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. 

Updated Date - 2020-08-13T08:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising