ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణ పనులను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-07-09T11:11:53+05:30

నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు కింది ఎడమ ప్రధాన కాల్వ కింద భూసేకరణ పనులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి


నర్సంపేట, జూలై 8 : నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువు ప్రాజెక్టు కింది ఎడమ ప్రధాన కాల్వ కింద భూసేకరణ పనులను 15రోజుల్లోగా పూర్తిచేయాలని దేవాదుల ప్రాజెక్టు అధికారులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు అధికారులు, ఆర్డీవో, రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. లింక్‌ మెయిన్‌ కెనాల్‌, కుడి కాల్వల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు.


ఎడమ ప్రధాన కాల్వ వన్‌ఆ్‌ఫ-70 పరిధిలో ఉన్నందున న్యాయపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నర్సంపేట మండలం రాజుపేట, నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామాల్లో కొంతమేర భూసేకరణ, కాల్వ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, భూసేకరణ పూర్తి చేసి రైతులకు డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించారు. వచ్చే రబీనాటికి నర్సంపేట నియోజకవర్గంలో 26వేల ఎకరాలకు, ములుగు మండలంలో 7వేల ఎకరాలకు రంగాయచెరువు ప్రాజెక్టు ద్వారా నీరందుతుందని తెలిపారు. సమావేశంలో దేవాదుల ఈఈ సాయిబాబా, డీఈ ఖాధర్‌, ఆర్డీవో పవన్‌కుమార్‌, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T11:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising