రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన
ABN, First Publish Date - 2020-12-12T04:49:10+05:30
రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన
ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య
జనగామ టౌన్, డిసెంబరు 11: రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీడుగా మారిన జనగామను టీఆర్‌ఎస్ ప్రభుత్వం సస్యశ్యామలం చేసిందన్నారు. నూతన పాలకవర్గం రైతన్నలకు అండగా నిలిచి చేయూత అందించాలన్నారు. మార్కెట్ పాలకవర్గం రైతుల అభిమానం పొందాలన్నారు. మార్కెట్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. జనగామ మునిసిపల్ చైర్‌పర్సన్ పి.జమున మాట్లాడుతూ రైతాంగ చేయూత లక్ష్యంగా నూతన పాలకవర్గం పాటు పడాలన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఐలేని ఆగిరెడ్డి, డైరెక్టర్లు చిన్నం నర్సింహులు, మాశెట్టి వెంకన్న, మల్యాల అశోక్, బూడిద రాజు, శంకర్, మహేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి జయహరి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, కురుమ సంఘం నాయకులు బండ భిక్షపతి, రవి, సేవెల్లి సంపత్ పాల్గొన్నారు.
ప్రజా చైతన్యరథ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
జనగామ కల్చరల్: జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రజా చైతన్య రథ యాత్ర ప్రతినిధులు శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోటుపై ముద్రించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్, భువనగిర పార్లమెంట్ ఇన్‌చార్జి గిరిమల్లె రాజు నేతృత్వంలో ప్రజా చైతన్యరథ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు.
Updated Date - 2020-12-12T04:49:10+05:30 IST