ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌ తరాల కోసం హరితహారం: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2020-07-13T10:55:59+05:30

విష్యత్‌ తరాల కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గీసుగొండ, జూలై 12: భవిష్యత్‌ తరాల కోసం ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. ఊకల్‌ శివారులో వైశ్యులకు సంబంధించిన 8 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్‌ గుండా ప్రకాష్‌రావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కమిషనర్‌ పమేలాసత్పతి, జట్పీటీసీ పోలీస్‌ ధర్మారావు, సర్పంచ్‌ మొగసాని నాగదేవత, ఎంపీటీసీ వీరారావు, నాయకులు పాల్గొన్నారు. కాగా 3వ డివిజన్‌ కీర్తినగర్‌లో కమిషనర్‌ కాలనీలో చేపడుతున్న పార్కులో పండ్ల, పూల మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. 


ఫరింగ్‌రోడ్డు నిర్మాణానికి సర్వే చేయించాలి: చల్లా

గ్రేటర్‌ వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అధికారులు వెంటనే భూ సర్వే చేయించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌హన్మంతు, కమీషనర్‌ పమేలాసత్పతి, కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డితో ఆయన ఆదివారం సమీక్షించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు కోసం భూములు ఇవ్వటానికి రైతులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బొల్లికుంట, ఆశాలపల్లి, కాపులకనపర్తి, గాడిపల్లి, దూపకుంట, వసంతాపూర్‌, స్థంభంపల్లి, ధర్మారం, పోతరాజుపల్లి, మొగిలిచర్ల, దామెర క్రాస్‌రోడ్డు వరకు రూట్‌ మ్యాప్‌ ప్రకారం భూ సేకరణ సర్వే చేసేందుకు అధికారులను ఆదేశించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. 

Updated Date - 2020-07-13T10:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising