ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: కేపీహెచ్‌బీలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం

ABN, First Publish Date - 2020-10-01T16:08:17+05:30

నగరంలోని కేపీహెచ్‌బీలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో ఉన్నానంటూ బాలుడు భవిత్‌ (13) తల్లికి ఫోన్‌ చేశాడు. దీంతో తల్లిదండ్రులు కుదుటపడ్డారు. బాలుడిని తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులతోపాటు పోలీసులు తిరుపతికి వెళ్లారు. గురువారం సాయంత్రంలోగా భవిత్‌ ఇంటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఆన్‌లైన్‌ క్లాసులపై శ్రద్ధపెట్టాలని తల్లి మందలించడంతో... రెండురోజుల క్రితం భవిత్‌ ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్‌కు చెందిన మహేందర్ గుప్త తన కుటుంబంతో కలిసి కె.పి.హెచ్.బీ కాలనీ 4వ ఫేజులో నివసిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న వారి కుమారుడు ఎస్.భవిత్(13) ఆన్ లైన్ క్లాసుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో తల్లి సంతోషి ఆన్ లైన్ క్లాసులపై శ్రద్ధ పెట్టాలంటూ మందలించింది. దాంతో భవిత్ మంగళవారం ఇల్లు విడిచి వెళ్ళాడు. భవిత్ కనిపించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాను తిరుపతిలో ఉన్నానని బాలుడు తల్లికి ఫోన్ చెయ్యడంతో అతడిని వెనక్కి తీసుకుని వచ్చేందుకు పోలీసులతో కలిసి తల్లిదండ్రులు తిరుపతి వెళ్ళారు.  

Updated Date - 2020-10-01T16:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising