ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ధాన్యం గింజ కొనే పూచీ ప్రభుత్వానిదే

ABN, First Publish Date - 2020-04-06T00:35:13+05:30

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.ఆదివారం మామడ మండలంలోని పోస్కల్‌ గ్రామంలో మార్కెట్‌కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ కరోనావైరస్‌ ప్రభావంతో పెను విషాదం నెలకొంటోందన్నారు. ఈ తరుణంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు, దళారులు కొనకూడదనే భావంతో ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు.రాష్ట్రంలో 5లక్షల 92వేల ఎకరాల్లో మక్కసాగు జరిగిందన్నారు. నిర్మల్‌ జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుఅయ్యిందన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందన్నారు. పౌరసరఫరాలశాఖ ఐకేపీ, పిఎసిఎస్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రంగం కుదేలయిందన్నారు. నిర్మల్‌ జల్లాలో 91 కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపపారు. క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 1760 చెల్లించనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనే పూచీ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపద్యంలో రైతులు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, మనిషికి, మనిషికి మధ్య మూడుఅడుగుల సామాజిక దూరం పాటించాలని సూచించారు. 

Updated Date - 2020-04-06T00:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising