ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి మంత్రుల సంతాపం

ABN, First Publish Date - 2020-08-04T19:42:22+05:30

కమ్యూనిస్టునేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిపట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కమ్యూనిస్టునేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిపట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. వాపపక్షనేతగా తన సిద్దాంతాలకు కట్టుబడి ఆచరించిన ఆదర్శ నేతలగా కొనియాడారు. ఈసందర్భంగా పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు మాట్లాడుతూ సున్నం రాజయ్య నిజాయితీ, నిబద్ధత నేతగా కొనియాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలుచూపిన నాయకుడు. అసెంబ్లీకి ఆటోలో వచ్చిన నిరాడంబరుడని అన్నారు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్ధించారు.


కాగా దేవాదాయ,  పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యం జనం మధ్యనే ఉంటూ అతి సామాన్య జీవితం గడిపిన గొప్పవ్యక్తి సున్నం రాజయ్య అన్నారు. ఆయన నిత్యం ప్రజల కోసమే ఆలోచించేవారని అన్నారు. ఆయన లాంటి నిజాయితీగల నేతలు రాజకీయాల్లోచాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కొలగాలని ప్రార్ధించారు.

Updated Date - 2020-08-04T19:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising