ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి తలసాని ప్రశంస

ABN, First Publish Date - 2020-04-05T20:41:26+05:30

కరోనా వైరస్‌ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రశంసించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సేవలందిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందిని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రశంసించారు. ఈమేరకు  ఆదివారం సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు,ఆశా వర్కర్లకు గులాబీ పూలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. వారికి వాటర్‌బాటిళ్లు, గ్లూకోజ్‌, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రమాదకరమైన కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పోలీసులు, వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ప్రజలు ప్రభుత ్వ సూచనలను పాటించాలని, లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని మంత్రి సూచించారు. 

Updated Date - 2020-04-05T20:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising