ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుట్‌పాత్‌వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తాం- తలసాని

ABN, First Publish Date - 2020-08-03T21:15:23+05:30

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హామీఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించుకునే వారికి తగు న్యాయం జరిగేలా చూస్తానని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హామీఇచ్చారు. సికింద్రాబాద్‌రైల్వేస్టేషన్‌ నుంచి బాటా వరకు చేపట్టిన వైట్‌ ట్యాపింగ్‌ రోడ్‌నిర్మాణం పూర్తయి ఫుట్‌పాత్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం పుట్‌పాత్‌వ్యాపారులతో మోండా మార్కెట్‌లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టిందన్నారు. రోడ్లపై ,ఫుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తుండడం వల్ల ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 


ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. తోపుడు బండ్లు, ఫుట్‌పాత్‌ వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎంత మంది వ్యాపారులు ఉన్నారు? వారికి ఎంత స్థలం అవసరమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ట్రాఫిక్‌ పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ రూప, జోనల్‌ కమిషనర్‌శ్రీనివాస్‌రెడ్డిఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T21:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising