ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా పాటించాలి- తలసాని

ABN, First Publish Date - 2020-06-05T20:05:54+05:30

పరిసరాలను పరిభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: పరిసరాలను పరిభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పద్మారావునగర్‌లోని స్కందగిరి కాలనీలో పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ముందుగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం జీహెచ్‌ఎంసి పిరిధుద్ధ్య సిబ్బందికి చెత్తను తరలించే ట్రై సైకిల్స్‌ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. 


పారిశుధ్ద్య నిర్వహణలో ప్రజలు జీహెచ్‌ఎంసి సిబ్బందికి సమకరించాలని అన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నిర్ధేశించిన ప్రాంతాల్లో మాత్రమే వేయాలన్నారు. సీజనల్‌ వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకూ పారిశుద్ద్య నిర్వహణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో కలిగే ప్రయోజనాల పై అవగాహన పెంచుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, జోనల్‌కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T20:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising