ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం: తలసాని

ABN, First Publish Date - 2020-10-30T22:03:46+05:30

పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం  ఎల్లప్పుడూ ముందుంటుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలకు చెందిన మహిళలు 10 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం పట్ల మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో  క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుందని సంతోషం వ్యక్తం చేశారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి పేద, మధ్య తరగతి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేశారని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మీ, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-30T22:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising