నేటి నుంచి పర్యాటకం షురూ
ABN, First Publish Date - 2020-10-01T07:06:38+05:30
కొవిడ్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం నుంచి రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలకు అనుమతిస్తున్నట్లు....
పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలకు అనుమతి
కొవిడ్ నిబంధనలు పాటించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం నుంచి రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి శ్రీనివా్‌సగౌడ్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పర్యాటక కేంద్రాల్లో బోటింగ్, టూరిజం బస్సు సర్వీసులతో పాటు హెరిటేజ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్న పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, కోటలు, మ్యూజియంలు, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలను ప్రారంభిస్తున్నట్టు వివరించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు విధిగా ఫేస్ మాస్క్‌లు, చేతి తొడుగులను ధరించాలన్నారు. పర్యాటక కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లకు అనుమతి ఇవ్వాలని అధికారులను శ్రీనివా్‌సగౌడ్ ఆదేశించారు.
Updated Date - 2020-10-01T07:06:38+05:30 IST