గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా పద్దతిని సులభతరం చేయండి
ABN, First Publish Date - 2020-12-30T20:39:03+05:30
కల్లుగీత కార్మికులు ప్రమాద వశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియా చెల్లింపు పద్దతి క్లిష్టతరంగా ఉందని, దానిని సులభతరం చేయాలని అబ్కారీ, పర్యాటక శాఖ
హైదరాబాద్: కల్లుగీత కార్మికులు ప్రమాద వశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియా చెల్లింపు పద్దతి క్లిష్టతరంగా ఉందని, దానిని సులభతరం చేయాలని అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులనుఆదేశించారు. సులభతర నిబంధనలను రూపొందించి ఒక వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన అబ్కారీశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టనున్న నీరా ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను యాదాద్రి జిల్లా నందనవనంలో ఏర్పాటు చేయడానికి సంబందధశిత ప్రాజెక్ట్ రిపోర్ట్‌కు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.యూనిట్ నిర్మాణ సంబంధిత టెండర్ ప్రక్రియ , ఇతర అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అలాగే ఎక్సైజ్‌శాఖలో పదోన్నతులపై కూడా మంత్రి చర్చించారు. పదోన్నతుల ప్రక్రియపూర్తిచేసి కొత్త సంవత్సరంలో అందరికీ పోస్టింగ్‌లు, బదిలీలు వెంటనే చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి డీపీసీలోకి వచ్చే ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
Updated Date - 2020-12-30T20:39:03+05:30 IST