ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహ నీయులను గౌరవించుకుంటున్న ప్రభుత్వం మనది-శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-08-13T20:02:36+05:30

తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవులను, రచయితలను, సాహివేత్తలు, వైతాళికులు, సామాజిక దృక్పధంతో పోరాడిన మహనీయులు, చరిత్రకారులను ప్రభుత్వం గౌరవించుకుంటోందని సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవులను, రచయితలను, సాహివేత్తలు, వైతాళికులు, సామాజిక దృక్పధంతో పోరాడిన మహనీయులు, చరిత్రకారులను ప్రభుత్వం గౌరవించుకుంటోందని సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అందులో భాగంగానే ‘భారతీయులందరూ నా సహోదారులు’ అంటూ పాడుకునేప్రార్ధనా గీతం రచించిన పైడి మర్రివెంకటసుబ్బారావును తెలంగాణ ప్రజలందరూ గౌరవించుకోవాలన్నారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు వర్ధింతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో భాషాసాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి నివాస్‌గౌడ్‌ ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్రపజల్లో ఈర్ష్య, స్వార్ధం పెరిగిపోతున్న రోజుల్లో దేశభక్తి పై విద్యార్ధి దశ నుంచే దేశం పట్ల, దేశభక్తిపట్ల అవగాహన అవసరమని గుర్తించి చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత విద్యార్ధుల్లో దేశ భక్తిని పెంపొందించడానికి ఒక గేయం ఉంటే బాగుంటుందని భావించి ప్రతిజ్ఞ రూపకల్పన చేశారని అన్నారు.


నల్గొండ జిల్లా అన్పేపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు సంస్కృతం, ఉర్ధూ , అరబ్బీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలలో పండితులుగా పలు రచనలు చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి అని ప్రచురించడం ప్రారంభమైందన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి పైడిమర్రిని గౌరవించే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పైడిమర్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T20:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising