ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను జయించినవారు ప్లాస్మా దానం చేయాలి- శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2020-08-12T21:08:20+05:30

కరోనా వైరస్‌ను జయించిన వారు తమ ప్లాస్మాను దానం చేయాలని తద్వారా కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు ప్రాణదానం చేసిన వారవుతారని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను జయించిన వారు తమ ప్లాస్మాను దానం చేయాలని తద్వారా కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు ప్రాణదానం చేసిన వారవుతారని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ‘ డొనేట్‌ ప్లాస్మా- సేవ్‌ లైఫ్‌’ అన్న నినాదంతో సత్తూర్‌ శిరీష ఆమె స్నేహితులు రూపొందించిన  వాల్‌పోస్టర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్దూర్‌శిరీష వారి మిత్రులు చేస్తున్న కరోనా వైరస్‌ పై అవగాహనా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా పై అవగహన పెంచుకోవాలని ఈసందర్భంగా సూచించారు. కరోనా నియంత్రణకు నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. 


ప్లాస్మాదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, ప్లాస్మా దానానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తిచేశారు. అంతే కాకుండా వైరస్‌తో పోరాడి చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి వారి పిల్లలు, బంధువులు ముందుకు రావాలన్నారు. చనిపోయిన వ్యక్తిలో వైరస్‌ సుమారు 4 గంటల కంటేఎక్కువసేపు ఉండవని తెలిపారు. అంత్య క్రియల్లో పాల్గొనే వారు తప్పని సరిగా పీపీఈ కిట్‌లు ధరించాలన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించి సుమారు 5 నుంచి 10 మంది వరకు పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 


పీపీఈ కిట్‌లు ధరించడం వల్ల ఎలాంటి వైరస్‌ వ్యాపించదని తెలిపారు. కరోనా బాధితుల పై మానవత్వాన్ని  చూపాలని విజ్ఞప్తిచేశారు. అంత్యక్రియలు చేయకుండా ఆసుపత్రిలో వదిలి వెళ్లేవారు చేసే పనిని మానుష చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, టీజీవో ఈసీ సభ్యురాలు శైలజ తదివతరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-12T21:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising