ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బ్రహ్మీశాసనం’ పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందన

ABN, First Publish Date - 2020-08-09T22:13:41+05:30

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్‌ తమ్మెద గ్రామంలో వెలుగు చూసిన 2200 ఏళ్ల నాటి బ్రాహ్మీశాసనం పై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్‌ తమ్మెద గ్రామంలో వెలుగు చూసిన 2200 ఏళ్ల నాటి బ్రాహ్మీశాసనం పై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. తక్షణమే పురావస్తుశాఖ అధికారుల బృందం శాసనాలు లభించిన ప్రదేశాన్ని సందర్శించి సమగ్రమైన నివేదికను వారం రోజుల్లో తనకు సమర్పించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఆ ప్రదేశంలో ఇంకా ఏమైనా రాతియుగం ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలు ఉంటే వాటని వెంటనే భద్రపరచాలని మంత్రి పురావస్తుశాఖ అధికారులకు లఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను వెలికి తీయడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పలు పరిశోధనలు జరుపుతున్నామని తెలిపారు.


అందులో భాగంగానే హెరిటేజ్‌ తెలంగాణ,కు బుద్ధవనంకు చెందిన పురావస్తు నిపుణులు, కన్సల్టెంట్‌లు మంజీరా నది పరీవాహక ప్రాంతంలో అన్వేషణలు జరుపుతున్నారని చెప్పారు. క్రీస్తుపూర్వ 2వ శతాబ్ధంనాటి, అశోక బ్రాహ్మీలిపి,లో ప్రాకృత భాషలో 5 లక్షరాలున్న మాధవచంద అని ఓ వ్యక్తి పేరు రాసిన లఘు శాసనం తొలిశాతవాహనుల కాలం నాటిదని చరిత్రకారులు వెల్లడించారని అన్నారు. ఈ శాసనం తెలంగాణకు సంబంధించిన శాసనాల్లో ఇదే పురాతనమైనదని అన్నారు. శాతవాహనుల కాలం నాటి పురావస్తు స్థలాలు,కోటి లింగాల, ధూలికట్ట వంటి దొరికిన శాసనాల కాలం కంటే ఇదేపురాతనమైనదని చెప్పారు. 

Updated Date - 2020-08-09T22:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising