ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ వల్ల కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2020-03-29T22:19:24+05:30

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ప్రత్యేకించి కేలీలు ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథాడ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ కారణంగా పేదలు ప్రత్యేకించి కేలీలు ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. కూలీల పిల్లలకు అంగన్‌వాడీ ద్వారా పాలు, గుడ్లు, ఆహారమివ్వాలని అన్నారు. వ్యవసాయ పనుల్లో వలస, దినసరి కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు. రేషన్‌షాపుల ద్వారా 12కేజీల బియ్యం, 1500 రూపాయలు సకాలంలో అందించాలన్నారు. ఆదివారం కలెక్టర్‌ కార్యాలయం సమీక్షా సమావేశం నిర్వహించారు. మహ బూబాబాద్‌ జిల్లాలో వలస కూలీలు, దినసరి కూలీలు, విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నకరోనా బాధితులు, ధాన్యం కొనుగోలుపై చర్చించారు. 


జిల్లాలో వరి ధాన్యం,మొక్కజొన్న కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం, పంట నిలువ కోసం గోదాములు సరిగ్గానిర్వహించాలన్నారు. రైతులపై ఈ లాక్‌డౌన్‌ ప్రభావం పడకుండా అన్నిచర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా విదేశాల నుంచి వచ్చిన 105 మంది క్వారంటైన్‌ పై నిరంతర నిఘా ఉంచాలన్నారు. వీరిలో 14 రోజుల క్వారంటైన్‌ పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్లిన వారిపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. క్వారంటైన్‌పూర్తిచేసుకునే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ సోకినట్టు అనుమానమున్న వారి నమూనాలు పరీక్షలకు పంపించిన తర్వాత వాటి ఫలితాలు వచ్చిన తర్వాతనే వారిని క్వారంటైన్‌ నుంచి బయటకు పంపాలని సూచించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేసుకున్న వారికి నచ్చచెప్పితీయించాలని, అత్యవసర సేవలు అందించడంలో వాటిల్లే ఇబ్బందులను వారికి వివరించాలన్నారు. 

Updated Date - 2020-03-29T22:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising