ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే లక్ష్యం- సత్యవతి

ABN, First Publish Date - 2020-09-23T20:22:04+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అన్నారు. ఇప్పటికే భక్తరామదాసు ప్రాజెక్టుతో సస్యశ్యామలం అయ్యిందని సీతారామ ప్రాజెక్ట్‌ బయ్యారం వరకు వచ్చి పాలేరు రిజర్వాయర్‌ వరకు వస్తుందనుకున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాధోడ్‌ అన్నారు. ఇప్పటికే భక్తరామదాసు ప్రాజెక్టుతో సస్యశ్యామలం అయ్యిందని  సీతారామ ప్రాజెక్ట్‌ బయ్యారం వరకు వచ్చి పాలేరు రిజర్వాయర్‌ వరకు వస్తుందనుకున్నాం. కానీ కొత్త ప్రతిపాదన వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ను కలిసి గ్యాప్‌ వస్తుందని చెప్పాను. కనెక్టివిటీ కోసం సర్వేచేయమన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం పొందల్సివుందన్నారు. గతంలో రాదు అనుకున్న సీతారామ ప్రాజెక్టు డోర్నకల్‌కి వస్తుంది. డోర్నకల్‌ నుంచి 16 కి.మీ. వెడల్పుతో ప్రవహింనుందని చెప్పారు. అయితే కాళేశ్వరం ద్వారా డోర్నకల్‌కి నీరు అందుతున్నా గార్ల బయ్యారంలో సాగునీరు ఇబ్బంది ఉందని అన్నారు. 


మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా సీతారామ ప్రాజెక్ట్‌ను విస్తరించేందుకు మంత్రి సత్యవతి , రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాధోడ్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు వర ప్రదాయిని అని చెప్పారు. 


గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న గార్ల, బయ్యారం ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్నాయని, ఈ మండలాలు సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా లబ్ధి పొందేలా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని మంత్రి కోరారు. ఈసమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్‌ రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్‌ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T20:22:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising