ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా

ABN, First Publish Date - 2020-03-30T21:41:21+05:30

రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతు బజార్ తరలింపు ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం కొత్తపేట చౌరస్తాలో ఉన్న రైతు బజార్‌ను తాత్కాలికంగా విశాల ప్రదేశమైన విక్టోరియా మెమోరియల్ హోమ్ మైదానంలోకి మార్చారు.  ఈ తాత్కాలిక రైతు బజారు ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ  ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ప్రజలందరూ ఒకే చోట గుంపులు గుంపులు ఉండకుండా, కూరగాయలు కొనుక్కొని  నేరుగా ఇంటికి  వెళ్లే విధంగా  అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా  విఎంహోమ్‌లో ఉండే  అనాధ పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కరోనా మహమ్మారి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని  చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కూడా సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, ఇలాంటి సందర్భంలో స్వచ్చంధ సంస్థలు కూడా ప్రజలకు సహాయపడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Updated Date - 2020-03-30T21:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising