ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇండ్లకు మెరూన్ రంగు పాస్ బుక్

ABN, First Publish Date - 2020-10-01T01:44:22+05:30

నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం:  నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44వ డివిజన్లలో మంత్రి పువ్వాడ బుధవారం పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరూన్ పాస్ బుక్ పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించి చైతన్యం, అవగాహన కల్పించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారికి సూచించారు. 


స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో ప్రభుత్వ స్థలంలో  ఇండ్ల కట్టుకుని నివాసం ఉంటున్న వారికి మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినందున ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ గారి నిర్ణయం మేరకు నగరాల్లో, గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి సూచించారు.


కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాల ఇవ్వాలని సిఎం కెసిఆర్ గారు నిర్ణయించారన్నారు.భూములకు భద్రత కల్పించడంతోపాటు, ఆయా భూ, ఇండ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నగరంలో ఇంటి నెంబర్, విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వగైరాలన్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ కర్ణన్ గారికి సూచించారు. 



Updated Date - 2020-10-01T01:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising