ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం నుంచి పూర్తిస్థాయిలో పంటల వివరాలు: నిరంజన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-05-24T21:45:03+05:30

వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి రాష్ట్రంలో పంటల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి రాష్ట్రంలో పంటల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంటల వివరాలన్నీ రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా వివిధ రంగులతో గుర్తించి ఏసర్వే నెంబరులో ఎంత పంట సాగులో ఉందో గుర్తించే నైపుణ్య దీనికి ఉందని అన్నారు. ట్రాక్‌ తెలంగాణ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రతి సీజన్‌లో వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు రిమోట్‌సెన్సింగ్‌ వివరాలతో అనుసంధానంచేసే అంశంపై వారు చర్చించారు. ఈ అద్భుతమైన సాంకేతిక విధానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే విషయమై పూర్తిస్థాయి నివేదికను తయారుచేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 


క్రాప్‌కటింగ్‌  ఎక్స్‌పరిమెంట్‌ డాటా రిమోట్‌ సెన్సింగ్‌తో అనుసంధానం చేస్తే వచ్చే పంట ఉత్పత్తి కూడా అంచనా వేస్తుందనారు  దాదాపు 95శాతం వాస్తవ సమాచారం లభిస్తుందన్నారు. సమగ్ర  వ్యవసాయ అమలు విధానం అమలుకు తెలంగాణ స్టేట్‌ రిమోట్‌సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌)ను అనుసంధారం చేసేందుకు కసరత్తుచేస్తున్నామని తెలిపారు. నేనలల స్వభావాన్ని కూడా అంచనా వేసే సామర్ధ్యం ఈ ట్రాక్‌ టెక్నాలజీకి ఉందని మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2020-05-24T21:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising