ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్షాల విమర్శల్లో అర్ధం లేదు- హోం మంత్రి మహమూద్‌అలీ

ABN, First Publish Date - 2020-07-13T01:00:11+05:30

సెక్రటేరియట్‌లోని మసీదు, మందిరం విషయంలో ప్రతిపక్షపార్టీల నాయకులు చేస్తున్న విమర్శలకు అర్ధం లేదని హోమ్‌శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌అలీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సెక్రటేరియట్‌లోని మసీదు, మందిరం విషయంలో ప్రతిపక్షపార్టీల నాయకులు చేస్తున్న విమర్శలకు అర్ధం లేదని హోమ్‌శాఖ మంత్రి మహ్మద్‌ మహమూద్‌అలీ అన్నారు. నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా అక్కడ నూతన మసీదు, మందిరాలను భారీస్థాయిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించిన తర్వాత కూడా ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. నూతన సచివాలయ భవనం నిర్మించిన తరువాత మసీదు, మందిరంలో ప్రార్ధనలు చేసిన తర్వాతనే నూతన సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విషయంలోప్రతి పక్షపార్టీల నాయకులకు ఏ అంశం దొరకలేదని మసీదు, మందిరం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు. 


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పధకాలను చూసి ఓర్వలేక, మున్ముందు ఇదే విధంగా కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్యులర్‌ నాయకుడని అన్నిమతాలు, కులాలను, వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే యాదగిరి గుట్టలో చరిత్రలో లిఖించదగ్గ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అంతపెద్ద దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న సీఎంకు సెక్రటేరియట్‌లో మసీదు, మందిరం నిర్మాణం చేయడం పెద్ద సమస్య కాదని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించ వద్దని హితవు చెప్పారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై విశ్వాసం ఉందని, ప్రతిపక్ష నాయకుల కల్లబొల్లిమాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని హోమ్‌మంత్రి స్పష్టంచేశారు. 

Updated Date - 2020-07-13T01:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising