కరోనా మందులు ఉత్పత్తి చేయండి
ABN, First Publish Date - 2020-03-27T09:57:53+05:30
కరోనా కట్టడికి అవసరమైన మందులను ఉత్పత్తి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫార్మా కంపెనీలను కోరారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన రాష్ట్రంలోని
ఫార్మా కంపెనీలతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి అవసరమైన మందులను ఉత్పత్తి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫార్మా కంపెనీలను కోరారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన రాష్ట్రంలోని ఫార్మా మరియు బల్క్ డ్రగ్ ఉత్పాదక యూనిట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లోనూ ఫార్మా పరిశ్రమను ప్రభుత్వం అత్యవసర ేసవారంగంగా గుర్తించిందని మంత్రి గుర్తు చేశారు. కరోనా వైరస్ కట్టడి కోసం అవసరమైన ఉత్పత్తులను తయారు చేేసందుకు ఉన్న అవకాశాలపైన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి అవసరమైన మందులను ఉత్పత్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ మందుల తయారీ ఉత్పత్తులు తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే కాకుండా దేశానికి, ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పంపేంత సామర్థ్యం కూడా ఇక్కడి కంపెనీలకు ఉందని మంత్రి అన్నారు.
అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరంకాని ఫార్మా ఉత్పత్తుల తయారీని తగ్గించుకొని... కరోనాను నియంత్రించే ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదా ఇతర ప్రైవేటు సంస్థలకు కావాల్సిన సోడియం హైపోక్లోరైట్, బ్లీచింగ్ పౌడర్, హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తికి అవకాశాలను పరిశీలించాలని కోరారు. వీలైతే ఈ ఉత్పత్తులను ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
Updated Date - 2020-03-27T09:57:53+05:30 IST