ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సనత్‌ నగర్‌ నియోజక వర్గంలో కేటీఆర్‌ హరితహారం

ABN, First Publish Date - 2020-06-23T23:01:38+05:30

ఈనెల 25వ తేదీన సనత్‌నగర్‌ నియోజక వర్గం పరిధిలోని అమీర్‌పేటలో గల సత్యంధియేటర్‌ వద్ద మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మొక్కలునాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఈనెల 25వ తేదీన సనత్‌నగర్‌ నియోజక వర్గం పరిధిలోని అమీర్‌పేటలో గల సత్యంధియేటర్‌ వద్ద మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మొక్కలునాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పనిచేస్తున్నారని అన్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో 2.50కోట్లు, హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో 5కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తలసాని తెఇలపారు. అనంతరం బల్కంపేట గ్రేవ్‌యార్డులో మొక్కలు నాటుతారని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు , కాలనీ సంఘాలు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. 


కాగా మంత్రి తలసాని ఈనెల 26వ తేదీ నుంచి హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసిలోని వివిధ నియోజక వర్గాల్లో పాల్గొని మొక్కలు నాటుతారు. 26న సనత్‌నగర్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాలు, 27న సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గాలు, 28న గోషామహల్‌, నాంపల్లి, కార్వాన్‌, 29న కంటోన్మెంట్‌, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, 30న ఉప్పల్‌, ఎల్‌బి నగర్‌, మలక్‌పేట నియోజక వర్గాల పరిధిలో పర్యటించి మొక్కలు నాటుతారు. 

Updated Date - 2020-06-23T23:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising