ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రమాణాలను పెంచాలి- కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-09-23T21:40:03+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌బిజినెస్‌ ప్రమాణాలను మరింత పెంచాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌బిజినెస్‌ ప్రమాణాలను మరింత పెంచాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. దీనికి సంబంధించి నూతన సంస్కరణలు తీసుకు రావాలని అన్నారు. బుధవారం దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సంస్కరణలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌కు మంత్రి ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేసే సంస్కరణతో ఆయా శాఖల పనితీరులో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక భవన నిర్మాణ అనుమలులను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రవేశ పెట్టిన టీఎస్‌ బీపాస్‌ చట్టం పై కూడా మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌ బీపాస్‌ అనేది చారిత్రక చట్టమని చెప్పారు. దీని అమలులో వివిధ శాఖల సహకారం , సమన్వయం కూడా తప్పని సరి అన్నారు. సంబంధం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలుచేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T21:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising